గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్20: గంగవరం ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కే కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ్ పక్వాడ కార్యక్రమం ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంటి వద్ద పిల్లల చదువు, ఆరోగ్యం, సరైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల పిల్లలపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. అలాగే ఐ వి ఆర్ ఎస్ సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.కార్యక్రమం అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు పోషకాహారం ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ టి. లక్ష్మణరావు, రెవెన్యూ సిబ్బంది రాజేశ్వరి, పద్మ కుమారి, రాజేష్ కన్నా, ఏపీఎం బి. అప్పలకొండ, వీఆర్వోలు, వీఓఏలు, అంగన్‌వాడీ సిబ్బంది ఎం. లక్ష్మీ సుజాత, సిరి లక్ష్మీ, కటాక్షం, వెంకటరమణ, సీత, కె. మణి, లక్ష్మీదేవి, పార్వతీ తదితరులు పాల్గొన్నారు.