PEN POWER
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 2:47 pm Posted By : D Ratnam

గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర విద్యా సదస్సు ను జయప్రదం చేయండి

 

యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ

గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 9:
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫేడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా 12 ఏప్రిల్ -2026 న పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు, విద్యార్థులు సమస్యలు పరిష్కారం కొరకు జరిగే రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు కు సంబందించిన కరపత్రాలు పోస్టర్స్ ను గంగవరం మండలం మోహనాపురం లో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం యుటిఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, విద్యార్థులు సమస్యలు పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫేడరేషన్ రాష్ట్ర కమిటీ తరుపున ప్రాతినిధ్యం చేసినప్పటికీ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం జరగడం లేదు. ఈ నేపథ్యంలో గిరిజన ఉపాధ్యాయుల, విద్యార్థులు సమస్యలు మరోసారి ప్రభుత్వం దృష్టికి, గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకొని వెళ్లవలిసిన అవసరం ఉందని తెలిపారు. ఈ సదస్సు ను జయప్రదం చేయడానికి గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యా రంగా శ్రేయోభిలాషులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్ వి వి సత్యనారాయణ యుటిఎఫ్ నాయకులు రాంబాబు, వెంకన్న దొర, బాబురావు తదితరులు ఉన్నారు.