PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 10:56 pm Posted By : YEDUKONDALU DADALA

గొల్లపాలెంలో ఘనంగా సిబిఎన్ జన్మదిన వేడుకలు

కాజులూరు, పెన్‌పవర్, ఏప్రిల్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి సీనియర్ నాయకుడు చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా మంత్రి సుభాష్ భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. అనంతరం ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆర్యవటం గ్రామానికి చెందిన పెంకే శ్రీలక్ష్మి (ఎంపీసీ 984/1000), కాజులూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన కట్టా శిరీష (బైపీసీ 967/1000)లకు చందాల ఆదినారాయణ ట్రస్ట్ మరియు మంత్రి సుభాష్ సహకారంతో ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున ప్రోత్సాహకంగా అందించారు.అనంతరం జరిగిన సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో కూడా రోజుకు ఐదు గంటల మాత్రమే నిద్రపోతూ నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకున్న నాయకుడని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనితెలిపారు.


రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పిస్తూ, కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కాజులూరు మండలానికి సుమారు రూ.72 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రామచంద్రపురం నియోజకవర్గానికి మరో రూ.150 కోట్ల నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. త్వరలో గొల్లపాలెం -కుయ్యేరు రోడ్డు పూర్తికానుందని కూడా పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి సుభాష్ వెల్లడించారు.
సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన చుండ్రు వీర్రాజు చౌదరిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ కి అనేక సేవలు అందించారని మంత్రి సుభాష్ కొనియాడారు. సిబిఎన్ పుట్టినరోజు సందర్భంగా చుండ్రు వీర్రాజు చౌదరి భారీ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మండల టిడిపి అధ్యక్షుడు చవ్వాకుల నారాయణ మూర్తి, నియోజకవర్గ పరిశీలకులు, మహిళా నాయకులు కాకినాడ రామారావు, కొండబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త,శలపాక నీటి సంఘం అధ్యక్షులు తాడి రామారెడ్డి (టిఎం ఆర్) అంగర కృష్ణ, డేగల సతీష్, నక్కా శ్రీను,గుత్తుల బుల్లిరాజు,కోక హరి, హనుమంతు చౌదరి, పేపకాయల బాబ్జి వీరబ్రహ్మం, అర్జున్,దడాల నాగార్జున,అత్తిలి వెంకటరమణ,వెలుగు ఏపీఎం రాము,సీసీలు సురేష్,జ్యోతి, వీవోఏలు బి.అనంత,ప్రభావతి ,ఇంద్ర, అపర్ణ,శేషారత్నం,శైలజ,సీతారాం, డ్వాక్రా మహిళలు ,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.