PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 7:27 pm Posted By : M CHANTI BABU

గ్రామసభలో వినతుల పరిష్కారానికి చర్యలు: ప్రత్యేక అధికారి డి.గిరిబాబు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 16:గ్రామసభలో వచ్చిన వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జీకే వీధి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి దాసరి గిరిబాబు తెలిపారు.గురువారం జీకే వీధిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన మాట్లాడుతూ—గిరిజనులు గ్రామసభపై విశ్వాసంతో తమ సమస్యలు, వినతులను సమర్పించారని అన్నారు. వాటిపై ప్రత్యేక తీర్మానాలు చేసి పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సభలో సభ్యులు గతంలో పంచాయతీ చేసిన తీర్మానాలను సమీక్షించాలని, పంచాయతీ నిధులు సక్రమంగా వినియోగించాయో లేదో పరిశీలించాలని ప్రత్యేక అధికారిని కోరారు. అలాగే వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, క్లాప్ మిత్రులకు వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పసుపులేటి నాగమణి,రిమెల రాజేశ్వరీ, తాజా మాజీ సర్పంచ్ కొర్ర సుభద్ర, పేసా కమిటీ సభ్యులు కూటమి నాయకులు గొర్లె వీర వెంకట్, కొర్ర బలరాం, సిద్ధార్థ మార్క్, పి.నీలకంఠం,పంచాయితీ కార్యదర్శి పండ్రా పాల్ తదితరులు పాల్గొన్నారు.