PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 6:59 am Posted By : M CHANTI BABU

గ్రామస్థాయిలో టీడీపీ బలోపేతమే లక్ష్యం: జీకే వీధి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి

గూడెంకొత్తవీధి/చింతపల్లి,పెన్ పవర్, ఏప్రిల్ 26:గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామాల పర్యటన చేపడుతున్నట్లు ఆ పార్టీ జీకేవీధి మండల ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి నాగమణి తెలిపారు. చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఆదివారం ఆమె పర్యటించి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అర్హులకు చేరుతున్నాయని చెప్పారు. పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గిడ్డి ఈశ్వరి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు వంతల రాంబాబు, పెసా కమిటీ ఉపాధ్యక్షుడు కొర్ర పేతురు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.