PEN POWER
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 8:49 pm Posted By : YEDUKONDALU DADALA

గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్‌లకు ఘన సన్మానం

తణుకువాడ, మంజేరు, ఒంటి తాడి సర్పంచ్‌ల సేవలకు ప్రశంసలు

రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 19:

కాజులూరు మండల పరిధిలో ఐదేళ్లపాటు సర్పంచ్‌లుగా సేవలందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన తణుకువాడ గ్రామ సర్పంచ్ నరాల సుబ్బరాజు, మంజేరు గ్రామ సర్పంచ్ గుంటూరి అప్పారావు, ఒంటితాడిగ్రామ సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ తదితరులను ఆదివారం ఘనంగా సన్మానించారు.వారి పదవీకాలం ఇటీవల ముగియడంతో,రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన ఓ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ , నియోజకవర్గ కన్వీనర్ పిల్లి సూర్య ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు మెమెంటోలు అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి, ప్రజా సేవలో సర్పంచ్‌లు చూపిన నిబద్ధత అభినందనీయమని కొనియాడారు.

గ్రామస్థాయి పాలనలో వారి పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాజులూరు జెడ్పీటీసీ వనుం వెంకట సుబ్బారావు,ఎంపీపీ మాత భారతీ మురళితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.