PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 3:41 pm Posted By : D Ratnam

గ్రామాభివృద్ధికి సమిష్టిగా సహకరించాలి

 

డిప్యూటీ ఎంపీడీఓ గోపన్నదొర

గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 4:
గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని డిప్యూటీ.ఎంపీడీఓ గోపన్నదొర పేర్కొన్నారు. శనివారం గంగవరం మండలం మొల్లేరు గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీరభద్రరావు, సిబ్బంది వీరబాబు, స్థానిక నాయకులు, మాజీ సర్పంచ్ లక్ష్మి పాల్గొని గోపన్నదొరకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన గోపన్నదొర గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.