PEN POWER
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 4:07 pm Posted By : D Ratnam

ఘనంగాపోషణ్ పక్వాడ పక్షోత్సవాలు ప్రారంభం

 

గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 9:

పిల్లల్లో మొబైల్, టివి వంటి స్క్రీన్ లను చూసే సమయాన్ని తగ్గించడం ఈ ఏడాది పోషణ్ పక్వాడ పక్షోత్సవాల ప్రధాన లక్ష్యమని సిడిపివో సుచరిత ఆదిలక్ష్మి అన్నారు. గురువారం మండలం లోని గంగవరం పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిఎస్ఎన్ఎంఏ (ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష అభియాన్) గర్భిణీలకు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోషణ పక్వాడ్ కార్యక్రమం లో భాగంగా గర్భిణీలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తాసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో లక్ష్మణరావు గర్భిణీలను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లి మహిళ శిశు పోషణ, మూడు సంవత్సరాల లోపు పిల్లల్లో మేధాభివృద్ది, ఆట ఆధారిత విద్య, పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించేందుకు గాను తల్లిదండ్రులు మరియు సమాజం పాత్ర, అంగన్వాడీ కోసం సమాజ మద్దతు సమీకరణ, పిల్లలకు ప్రాసెస్డ్ ఫుడ్డు తగ్గించడం, హానికర అలవాట్లు(ఫోను స్క్రీన్ తగ్గించడం), నేచర్, ఆటలు అలవర్చడం, ఎక్కువ సాల్టు ఉన్న పదార్థాలు తినడం వలన పిల్లల్లో బరువు పెరిగి, జీర్ణకోస సమస్యలు ఏర్పడుతున్న కారణంగా తల్లులతోపాటు తండ్రులకు కూడా ఈ విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారులు ,వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.