PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:15 pm Posted By : KALYANA CHAKRAVATHI V

ఘనంగా వీరేపల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.

ఉలవపాడు, పెన్ పవర్, ఏప్రిల్ 14:

భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామ పంచాయితీ నందు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరేపల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ ఎంపీడీఓ సీ.హెచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తొలుత గ్రామ సచివాలయం నందు పంచాయతీ సెక్రటరీ కె.సుమలత ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సామాజిక సంస్కర్త, మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సెక్రటరీ, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సెక్రటరీ సుమలత మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాన్ని, సమానత్వాన్ని గుర్తుచేసుకునే రోజుగా ఇది నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కే.సుమలత, గ్రామ పార్టీ అధ్యక్షులు లక్కంరాజు నరేష్ వర్మ, పాటశాల విద్యాకమిటి చైర్మన్ తాటితోటి ప్రభాకరరావు, టిడిపి నాయకులు గొల్లపూడి సత్యం, గురవయ్య, నతానియేలు, ఆదినారాయణ, తిరుపతి, శివ, నరసింహ, సచివాలయ సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ వెంకట్రావు, విజయ్ కుమారి, అంగనవాడి సిబ్బంది అనూష, పద్మావతి, కళ్యాణి, నాగరాజి, పగడాల అనూష, శ్రావణి, అరుణ, ప్రసన్న రాణి, గ్రామ వీఆర్ఏ కొండల రాయుడు తదితరులు పాల్గొన్నారు.