PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 5:51 pm Posted By : Sathish Bede

చింతూరులో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 68 దరఖాస్తులు స్వీకరణ

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 29:

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రాజెక్టు అధికారి శుభం నోఖ్వాల్, ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 68 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు ఆన్లైన్ ద్వారా పంపించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సిందిగా ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల సమస్యలను సమగ్రంగా తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవడం అధికారుల ముఖ్య బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి నాలుగు మండలాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఎంపీడీవోలు, తహశీల్దారులు, సీడీపీవోలు, ఎంఈఓలు, ఏపీఎంలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.