PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 6:50 pm Posted By : ANIL KUMAR G

జగ్గంపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

జగ్గంపేట, పెన్ పవర్ ,ఏప్రిల్ 4

జగ్గంపేట నెహ్రూ కాలనీలో జగ్గంపేట సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో సిబ్బందితో శనివారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జగ్గంపేట ఎస్సై టి.రఘునాధరావు, గండేపల్లి ఎస్సై శివ నాగబాబు, కిర్లంపూడి ఎస్సై సతీష్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. కాలనీలో సుమారు 100 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సరైన ధ్రువపత్రాలు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినా, మత్తు పదార్థాలు విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దొంగతనాలు జరగకుండా స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచనలు చేశారు.