PEN POWER
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 4:32 pm Posted By : SIVA KUMAR LANKA

జనసేన క్రియాశీల సభ్యుడి కుటుంబానికి రూ. 5లక్షలు అందజేత

జనసేన క్రియాశీల సభ్యుడి కుటుంబానికి రూ. 5లక్షలు అందజేత

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేటకు చెందిన పెదపూడి రాజేష్ ఏడాది క్రితం మృతి చెందాడు. ఇతను జనసేన పార్టీ సభ్యత్వ కలిగి ఉన్నాడు. ఈ మేరకు జనసేన పార్టీ తరపున రూ. 5 లక్షల ఇన్యూరెన్స్ చెక్కు మంజూరైంది. ఈ నేపధ్యంలో గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చేతుల మీదుగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర సమక్షంలో పెదపూడి రాజేష్ తల్లికి ఈ రూ. 5లక్షల ఇన్యూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లురి మాట్లాడుతూ జనసేన క్రియాశీల సభ్యత్వం కలిగి ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షల ఇన్యూరెన్స్ అందిస్తుందని చెప్పారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ పెదపూడి రాజేష్ పార్టీలో ఎంతో కీలశీలకంగా పని చేశారని గుర్తు చేశారు. ఆ మరణం బాధాకరమని, పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పని చేశారని చెప్పారు. జనసేన క్రియాశీలక సభ్యులు అనుకోని ప్రమాదాల్లో మరణిస్తే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని చెప్పారు. పెదపూడి రాజేష్ కు ఇన్యూరెన్స్ అందజేసిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పాతాళ శివ, యర్రా ప్రసాద్, వాలంటీర్ దుంపలపూడి వంశీ, నాతవరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సూరిశేఖర్ పాల్గొన్నారు.