PEN POWER
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 3:46 pm Posted By : D Ratnam

జలధార వేగవంతం – 100 రోజుల ప్రణాళికతో భూగర్భ జలాల పెంపు

 

గంగవరం/రంపచోడవరం, ఏప్రిల్ 7: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్‌తో కలిసి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 8 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలను 100 రోజుల ప్రణాళికతో 3 మీటర్లకు తీసుకురావడం లక్ష్యమన్నారు.

గ్రామాల వారీగా నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, కాలువల పూడికతీత, రేన్‌వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15లోపు ప్రతిపాదనలు పంపించాలని, క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ అమలు చేసి, పనుల పురోగతిని నిరంతరం నమోదు చేయాలని ఆదేశించారు.