PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 10:49 pm Posted By : YEDUKONDALU DADALA

జాతీయ నేతల విగ్రహాల రక్షణకు పటిష్ట చర్యలు

ఎస్సై ఎం.మోహన్ కుమార్

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 4:
గొల్లపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మహనీయుల విగ్రహాల రక్షణ కోసం పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, మరియు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దేవరాజ్ పాటిల్ మనీష్, ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.కాకినాడ రూరల్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై ఎం. మోహన్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది పలు గ్రామాల్లో పర్యటించి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను పరిశీలించారు.ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులతో సమావేశమై భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. విగ్రహాల వద్ద నిరంతర నిఘా కోసం తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు.

రాత్రి వేళల్లో అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు సరిపడా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మహనీయుల విగ్రహాల పట్ల గౌరవాన్ని చాటుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిటీ సభ్యులు, స్థానిక యువతకు సూచించారు. విగ్రహాలకు ఎటువంటి నష్టం కలగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ఉద్దేశపూర్వకంగా విగ్రహాలను ధ్వంసం చేయడం లేదా అగౌరవపరిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.