జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్
కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 20:జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు.సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణతో పాటు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
జిల్లాలో వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాల్లో పూర్తి చేయాలని సూచించారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0, 2.0; గ్రామీణ్ కింద జిల్లాలో మొత్తం 62,478 గృహాల నిర్మాణానికి గాను ఇప్పటివరకు 34,054 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంటు తదితర నిర్మాణ సామాగ్రి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో హౌసింగ్ మేనేజర్ కే. సురేష్, కాకినాడ, పెద్దాపురం ఈఈలు కె.ఎస్.ఎన్. రెడ్డి, ఎల్. శ్రీనివాసు, ఇతర డీఈలు తదితరులు పాల్గొన్నారు.