గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 18: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జీకే వీధి పంచాయతీలో శనివారం ప్రత్యేక పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి దాసరి గిరిబాబు, కార్యదర్శి పండ్ర పాల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో విస్తృతంగా శానిటేషన్ పనులు చేపట్టారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో, వ్యాపార దుకాణాల్లో మిగిలే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయవద్దని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా ఉంచితే పారిశుద్ధ్య కార్మికులు సులభంగా సేకరిస్తారని పేర్కొన్నారు.ప్రజలు సహకరిస్తేనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందని, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోవచ్చని ప్రత్యేక అధికారి గిరిబాబు పిలుపునిచ్చారు.