గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15:జీకే వీధి ఏకలవ్య పాఠశాలలో సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 59 మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ రమణరావు తెలిపారు.600 మార్కులకు గాను 548 మార్కులు సాధించిన ఎం. దారా శ్రీ పాఠశాల టాపర్‌గా నిలిచారు. 542 మార్కులతో జి. బాలు ద్వితీయ స్థానం సాధించారు.ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు.