PEN POWER
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 4:52 pm Posted By : M CHANTI BABU

జీకే వీధి కేజీబీవీకి ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గూడెం కొత్తవీధి కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ప్రథమ సంవత్సరంలో 95%, ద్వితీయ సంవత్సరంలో 97% ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో సాగిన సింధుతులాని 871 మార్కులతో, ప్రథమ సంవత్సరంలో కె. సుబ్బలక్ష్మి 446 మార్కులతో టాపర్లుగా నిలిచారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, బోధన సిబ్బంది అభినందించారు.