PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 2:21 pm Posted By : SIVA KUMAR LANKA

డా.బిఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన స్పీకర్, హోం మంత్రి

  1. డా.బిఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన స్పీకర్, హోం మంత్రి

నర్సీపట్నం, పెన్ పవర్ :

అనకాపల్లిజిల్లా నాతవరం మండలలో మంగళవారం ఉదయం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విస్తృతంగా పర్యటించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, నాతవరం ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పిఎం సూర్యఘర్ పథకంలో భాగంగా స్థానిక లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సోలార్ గృహాన్ని వారు ప్రారంభించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో దళితవాడలను అభివృద్ధి చేస్తున్నామని హోం మంత్రి అనిత తెలిపారు.