విశాఖపట్నం:పెన్ పవర్ ,ఏప్రిల్ 15
రుషికొండ బీచ్ సమీపంలోని ఎండాడ గ్రామంలో నిర్మితమైన డి కబానా రెస్టారెంట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ అనుమతులు లేకుండా సి ఆర్ జెడ్ కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబందించి కేసు డబ్ల్యూ పి పిల్ 99/2024లో భాగంగా విచారణకు వచ్చింది. దీనిపై గతంలో విచారణ చేసిన కమిటీని మళ్ళీ స్థల పరిశీలనకు నియమించడం జరిగింది. నియమించిన కమిటీ కోర్టుకు సమర్పించిన నివేదికలో రెస్టారెంట్ తరఫు న్యాయవాది, ఇప్పటికే ఈ నిర్మాణాన్ని 2025 జనవరిలో రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు కోర్టుకు తెలియజేశారు. అనధికార నిర్మాణాలన్నింటినీ 02.04.2026 నాటి అధికారుల నివేదిక ప్రకారం మూడు వారాల్లో తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో అక్కడ ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని ఆదేశించింది. ఈ కేసును తదుపరి విచారణ 2 జులై 2026కు వాయిదా వేసింది.