PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 10:04 pm Posted By : Sathish Bede

డ్రోన్ వినియోగంతో ఓపెన్ డ్రింకింగ్‌పై కేసులు నమోదు

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 17:

పోలవరం జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ ద్వారా పర్యవేక్షణ నిర్వహించిన పోలీసులు, ఓపెన్ డ్రింకింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించారు. ఈ సందర్భంగా మొత్తం ఆరుగురిపై పెటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజా ప్రదేశాలలో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ, సామాజిక బాధ్యతతో ప్రవర్తించాలని, శాంతి భద్రతలకు సహకరించాలని పోలీసులు సూచించారు. ఇకముందు కూడా డ్రోన్ సాయంతో పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు.