PEN POWER
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 6:09 pm Posted By : M CHANTI BABU

త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్‌పై ఇక కఠిన చర్యలు:జీకే వీధి సీఐ సుధాకర్ 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 25:మండలంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. యువకుల్లో మార్పు రాకపోవడంతో ఇకపై త్రిబుల్ రైడింగ్ మరియు రాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని గూడెం కొత్తవీధి సీఐ సుధాకర్ హెచ్చరించారు.వాహనదారుల్లో చాలామంది లైసెన్స్, హెల్మెట్, సరైన వాహన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు వారికి అవగాహన కల్పించేందుకు కేవలం కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించామని, అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ఇకపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నియమాలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకుని, లైసెన్స్ మరియు అవసరమైన పత్రాలు చూపించిన తరువాతే వాహనాలను విడుదల చేస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో పలు వాహనదారులకు చివరి అవకాశంగా కౌన్సెలింగ్ నిర్వహించి, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం వంటి ప్రమాదకర అలవాట్లను విడిచిపెట్టాలని సూచించారు.