PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 8:33 am Posted By : Sathish Bede

దళితుల సమస్యలపై ఐటిడిఏ పీఓ, డాక్టర్ జమాల్ ఖాన్‌ను కలిసిన సంఘ నాయకులు

 

 

చింతూరు, పన్ పవర్ ఏప్రిల్ 23 :

చింతూరు ప్రాంతంలో నివసిస్తున్న దళిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దళిత కుటుంబ సంక్షేమ సంఘం నాయకులు చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి (పీఓ)ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

 

సంఘ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, చింతూరులో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న దళితులకు అత్యవసరమైన స్మశాన వాటిక లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, దళిత కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే పాతిపెట్టడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్మశాన వాటిక కోసం తగిన స్థలం కేటాయించాలని పీఓను కోరారు. అదేవిధంగా, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చింతూరులో ముంపు లేని ప్రదేశంలో స్థలం కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై చింతూరు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జమాల్ ఖాన్‌ను కూడా సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు. తమ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, స్మశాన వాటిక మరియు అంబేద్కర్ విగ్రహ స్థలం కేటాయింపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం అధ్యక్షుడు మెల్లెం నాగేంద్రం, ప్రధాన కార్యదర్శి ఇంటి సుదర్శన్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. పలు సమస్యలను విన్నవిస్తూ వినతి పత్రం అందజేశారు.