PEN POWER
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:26 pm Posted By : M CHANTI BABU

దామనపల్లి పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18:మండలంలోని దామనపల్లి పంచాయతీ పరిధిలోని కట్టుపల్లి గ్రామంలో అలాగే పంచాయతీ కేంద్రంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కట్టుపల్లిలో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీడీవో బి.హెచ్.వి. రమణబాబు పరిశీలించారు.అనంతరం పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్. లక్ష్మి సమక్షంలో స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త–పొడి చెత్తలను వేర్వేరుగా సేకరణకు వచ్చే క్లాప్ మిత్రులకు అందించాలని సూచించారు. అలాగే ఐవీఆర్ కాల్స్‌కు సానుకూలంగా స్పందించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు జగదీష్, రత్నకుమార్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కళ్యాణ్ బాబు, పంచాయతీ కార్యదర్శులు బాలకృష్ణ, ఆర్. లక్ష్మి, పేసా కమిటీ సభ్యులు మాదిరి చంటిబాబు, వెంకటేశ్వర్లు, సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ బేరా సింహాచలం, గ్రామైక్య సంఘం వీఓఏ పాంగి బాలరాజు, గ్రామ పెద్దలు ఆరుకు యిర్మీయా ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, క్లాప్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.