గూడెం కొత్తవీధి, పెన్ పవర్,ఏప్రిల్ 23:దామనపల్లి పంచాయతీ పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో ఉన్న జలపాతం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. స్థానిక పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆర్‌వీఎస్ లక్ష్మి, పంచాయతీ సిబ్బందితో కలిసి జలపాతం వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు, యువకులు జలపాతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు నిర్లక్ష్యంగా జలపాతం వద్దకు చేరకుండా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి వారిని నిలువరించాలని కోరారు. ఇటీవల చెరువులు, కాలువల్లో పడి మరణాల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ బేరా సింహాచలం, సీఆర్‌పీ పాంగి బాలరాజు, క్లాప్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.