కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30:
కాజులూరు మండల పరిధిలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. మండల వ్యాప్తంగా పలు పాఠశాలలు ఉన్నత ఉత్తీర్ణత శాతం నమోదు చేయడంతో పాటు, అనేక మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం గమనార్హం.
శీల జడ్పీహెచ్ఎస్‌లో రాపాకుల రేష్మ, కర్నీడి జోష్న నవ్యశ్రీలు 554 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, మంగతాయారు 553 మార్కులతో ద్వితీయ స్థానం, సఖిలే కౌశిక్ 549 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
అయితేపూడి జడ్పీ పాఠశాలలో ఆనాల లావణ్య 568 మార్కులతో ప్రథమ స్థానం, గునిపే చరణ్ కుమార్ 566 మార్కులతో ద్వితీయ స్థానం, డి.ఎస్.ఎల్ నాగప్రణతి 563 మార్కులతో తృతీయ స్థానం పొందారు. ఇదే విధంగా కాజులూరుకు చెందిన సూరంపూడి మహేష్ బాబు 568 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.
మంజూరు జడ్పీ హైస్కూల్‌లో పుణ్యమంతుల పూర్ణశ్రీ లక్ష్మీ బుల్లెమ్మ 563 మార్కులతో ప్రథమ స్థానం, కోరుకొండ శిరీష 530 మార్కులతో ద్వితీయ స్థానం, పుణ్యమంతుల మానస 526 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
కోలంక ఎస్డీవీఆర్‌ఆర్ ఎయిడెడ్ హైస్కూల్‌లో నేదునూరి వాసవి సత్యమాణిక్యాంబ 500 మార్కులతో ప్రథమ స్థానం, పంపన హేమదుర్గ 484 మార్కులతో ద్వితీయ స్థానం, గణపతిరెడ్డి దేవి 475 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
జగన్నాథగిరి జడ్పీ హైస్కూల్‌లో మజ్జి ఇందు నవ్యశ్రీ 569 మార్కులతో ప్రథమ స్థానం, మాధవరపు చిట్టిలలితాదేవి 544 మార్కులతో ద్వితీయ స్థానం, దవులూరి వెంకటదుర్గ 539 మార్కులతో తృతీయ స్థానం పొందారు.
పెనుమళ్ల జడ్పీ హైస్కూల్‌లో జి. మానస్వి 569 మార్కులతో ప్రథమ స్థానం, వి.ఎల్ విరజాక్షిని 565 మార్కులతో ద్వితీయ స్థానం, కె. ఆదిలక్ష్మి 553 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
తనుకు జడ్పీ హైస్కూల్‌లో పితాని సూర్యచంద్ర కిరణ్ 525 మార్కులతో ప్రథమ స్థానం, సూరంపూడి ధీరజ్ కుమార్ 520 మార్కులతో ద్వితీయ స్థానం, ఆచంట మహేష్ వీర సత్యనారాయణ 509 మార్కులతో తృతీయ స్థానం పొందారు.
కుయ్యేరు జడ్పీ హైస్కూల్‌లో డి. సత్యస్నేహ గౌతమి 580 మార్కులతో ప్రథమ స్థానం, కే. శశి భార్గవి 567 మార్కులతో ద్వితీయ స్థానం, వై. దేవి వీర నిశ్విత 561 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
పల్లెపాలెం జడ్పీ హైస్కూల్‌లో సబ్బతి సౌజన్య 565 మార్కులతో ప్రథమ స్థానం, తూరంగి పుష్పకుమారి 549 మార్కులతో ద్వితీయ స్థానం, చీకట్ల కనకమహాలక్ష్మి 548 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
కాజులూరు జడ్పీ హైస్కూల్‌లో గీసాల తేజశ్రీ రమ్య 586 మార్కులతో ప్రథమ స్థానం, వల్లమ్మ సాయి వంశీ 575 మార్కులతో ద్వితీయ స్థానం, యాళ్ళ లీలా హారిక 572 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
గొల్లపాలెం జడ్పీ హైస్కూల్‌లో జి. కిరణమై 556 మార్కులతో ప్రథమ స్థానం, సి. వెంకట మనోజ్ 551 మార్కులతో ద్వితీయ స్థానం, ఏ. కీర్తన 523 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
మండలంలోని జడ్పీ పాఠశాలలు విద్యా ప్రమాణాలను పెంచుతూ విద్యార్థులు సాధించిన ఫలితాలు ప్రశంసనీయమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.
కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30:
