PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 6:10 am Posted By : Sathish Bede

పల్లపు వెంకట్ మళ్లీ రాష్ట్ర వర్కింగ్ కమిటీలోకి

సిఐటియు రాష్ట్ర మహాసభల్లో పోలవరం నాయకులకు కీలక పదవులు

 

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 19:

సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 17, 18, 19 తేదీల్లో నంద్యాల నగరంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ మహాసభల్లో పోలవరం జిల్లాకు చెందిన నాయకులు ప్రాధాన్యత కలిగిన పదవులకు ఎన్నిక కావడం విశేషం. పోలవరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ తిరిగి రెండోసారి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మరోవైపు పాయం సీతారామయ్య రాష్ట్ర వర్కింగ్ కౌన్సిల్ సభ్యునిగా ఎంపికయ్యారు. ఈ ఎన్నికలతో పోలవరం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించిందని సిఐటియు నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.