PEN POWER
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 2:44 pm Posted By : YEDUKONDALU DADALA

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 22:
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాజులూరు మండలం కోలంక గ్రామంలోని కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు శాంతి హోమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాజులూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు బొండా వెంకన్న, కోలంక సొసైటీ అధ్యక్షుడు బొండా వెంకట నరసింహ నాయుడు, కూటమి నాయకులు మేడిశెట్టి తాతారావు, బొండా వెంకటేశ్వరరావు, కంబాల సూరిబాబు, మేడిశెట్టి శంకర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరితగతిన కోలుకుని ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ప్రార్థనలు చేశారు.