హుకుంపేట,పెన్ పవర్,ఏప్రిల్ 1: మండలంలోని హుకుంపేట పంచాయతీలో సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ, కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పూర్ణిమ మాట్లాడుతూ, ఏప్రిల్ 2తో సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలుగా పంచాయతీ అభివృద్ధికి తనతో కలిసి కృషి చేసిన సభ్యులను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కాలంలో తనకు సహకరించిన పంచాయతీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పదవులతో సంబంధం లేకుండా భవిష్యత్తులో కూడా పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. సర్పంచ్ పూర్ణిమకు రానున్న రోజుల్లో ఉన్నత రాజకీయ పదవులు రావాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈఓ&పీఆర్‌డీ రామ్‌నాయుడు, కార్యదర్శి సత్యనారాయణ, వార్డు సభ్యులు నాగబాబు, వెంకట్, లక్ష్మణ్, అన్నపూర్ణ, గంగ, నూకరాజు, భాస్కర్, మచ్చమ్మ, వైస్ సర్పంచ్ కోడిదాస్ గోవింద్‌రావు, ఎంపీటీసీ కొమ్మ రమ, పేసా కమిటీ సభ్యులు రామకృష్ణ, గణేష్, వీర్రాజు, మండల అధ్యక్షుడు అనిల్, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.