PEN POWER
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 4:30 pm Posted By : SRIKANTH NARASIMHALA

ప్రజల ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షలు నిజం చేసే ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు : ప్రత్తిపాటి

  • హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మలిచిన దార్శనికుడు… అమరావతిని ఏఐ, క్వాంటమ్ సాంకేతికతల డెస్టినేషన్ గా మారుస్తున్న విజనరీ.
  • పోలవరం సాధకుడు…. నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పాటుపడుతున్న నిత్య శ్రామికుడు : ప్రత్తిపాటి
  • దూరదృష్టి.. పట్టుదల…. ప్రజాసేవపై అంకిత భావం…కలిగిన ప్రగతి కాముకుడు చంద్రబాబునాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు : ప్రత్తిపాటి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 19 : 

చిలకలూరిపేట : చంద్రబాబు నాయుడు.. ప్రపంచ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాజకీయ దురంధరుడు. విద్యార్థులకైనా, తలపండిన రాజకీయ నాయకులకైనా ఆయన ఆలోచనలు నిత్య పాఠ్యాంశాలు. చంద్రబాబు.. ఈ పేరు కోట్ల మందికి స్ఫూర్తి.. ప్రజల ఆశలు.. ఆకాంక్షలు.. ఆలోచనల్ని సాకారం చేసే రాజకీయ చైతన్య దీప్తి చంద్రబాబు. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ఆరంభించి.. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన తిరుగులేని నాయకుడు.
అవినీతి, దోపిడీలను నమ్ముకున్న రాజకీయ నేరస్తుల పాలిట సింహస్వప్నం. అభివృద్ధి అనే పదానికి ప్రతిరూపం.. సంక్షేమ పథకాల రూపకర్త. ఆధునిక పాలనా విధానాలు.. పరిపాలన సంస్కరణలకు ఆద్యుడు. కాలం కంటే వేగంగా భవిష్యత్ ను అంచనా వేయడంలో దిట్ట చంద్రబాబు. రాజకీయ వైకుంఠపాళిలోని విషసర్పాలను దాటుకొని, ప్రజాబలంతో ఎదిగిన తిరుగులేని డైనమిక్ పొలిటీషియన్. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మలిచిన దార్శనికుడు… అమరావతిని విశ్వ నగరంగా, ఏఐ, క్వాంటమ్ సాంకేతికతల డెస్టినేషన్ గా మారుస్తున్న విజనరీ లీడర్ చంద్రబాబు. పోలవరం సాధకుడు…. నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పాటుపడుతున్న నిత్య శ్రామికుడు. దూరదృష్టి.. పట్టుదల…. ప్రజాసేవ పట్ల అంకిత భావం…కలిగిన ప్రగతి కాముకుడు, రాష్ట్ర నాయకుడు, తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రివర్యులు ప్రజల ప్రియతమ నాయకుడు, చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.” అని మాజీ మంత్రి ప్రత్తిపాటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.