PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 9:47 am Posted By : SOMA RAJU GUMMIDI

ప్రజా ఆస్తుల లీజింగ్‌పై వివాదం స్టేడియాల్లో వాకింగ్‌కూ ఫీజులపై ఆందోళన

 

విశాఖపట్నం, పెన్ పవర్, ఏప్రిల్ 22 :

నగరంలో ప్రజా ఆస్తుల నిర్వహణ, వినియోగం పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాజకీయ, సామా జిక వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని స్టేడియాలు, పార్కులు, కళ్యాణ మండపాల నిర్వ హణను ప్రైవేట్ సం స్థలకు అప్పగించే ప్రతిపాదనలు వివాదాస్పదం గా మారాయి.అధికార వర్గాల సమా చారం ప్రకారం, నగరంలోని ఐదు స్టేడియాలు, పలు పార్కులు, సుమారు 50 కళ్యాణ మండపాలను దీర్ఘ కాలిక లీజు విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ చర్యల తో సౌకర్యాల నిర్వహణ మెరు గుపడుతుందని ప్రభు త్వం భావిస్తుండగా, ప్రజా ఆస్తులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉం దని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని సౌకర్యాల వినియోగంపై యూ జర్ ఛార్జీల విధానం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా స్వర్ణభారతి ఇం డోర్ స్టేడియం వంటి ప్రదేశాల్లో వాకింగ్‌కు వచ్చే వారిపై ప్రవేశ రుసుములు విధించే ప్రతిపాదన ప్రజల్లో చర్చనీయాంశమైంది. ప్రతిపాదిత విధా నాల ప్రకారం నెలకు సుమారు రూ.720 వరకు రుసుము ఉండే అవకాశముందని సమాచారం.
ఈ నిర్ణయాల వల్ల ముఖ్యంగా వృద్ధులు, మధ్య తరగ తి ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పలు వురు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం స్టేడియాలు, పార్కులు వినియోగించే సాధారణ ప్రజలకు ఇది అదనపు భారం అవుతుందనే ఆందోళ నలు వ్యక్తమవుతున్నాయి.ఇకపోతే, ప్రభుత్వం మా త్రం ప్రజాసౌకర్యాల నిర్వహణలో పారదర్శకత, నా ణ్యత పెంపు లక్ష్యంగా ఈ విధానాలను పరిశీలిస్తున్న ట్లు సంకేతాలు ఇస్తోంది. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని పౌర సంఘాలు, వివిధ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నా యి.
ఈ అంశంపై మరింత స్పష్టత కోసం అధికారిక ప్రకటన కోసం నగర ప్రజలు ఎదురుచూస్తున్నా రు.