పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 19
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ ముందడుగు వేసింది. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్‌లు, ప్రమాదకర మలుపుల వద్ద కుంభాకార దర్పణాలను ఏర్పాటు చేస్తూ వాహనదారుల భద్రతపై దృష్టి సారించింది.జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం సబ్‌డివిజన్ డీఎస్పీ యు. నాగరాజు పర్యవేక్షణలో యర్రగొండపాలెం సీఐ కె అజయ్ కుమార్, పుల్లలచెరువు ఎస్‌ఐ బి. సాంబశివరావు ప్రత్యేకంగా ప్రమాదకర ప్రదేశాలను గుర్తించారు. పుల్లలచెరువు మండలంలోని మలుపులు, జంక్షన్లు, వై-జంక్షన్‌లు, యూ-టర్న్‌లు, విజిబిలిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ దర్పణాలను అమర్చారు.
ఈ కుంభాకార దర్పణాల ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలు ముందుగానే కనిపించేలా ఏర్పాట్లు చేయడంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే డ్రైవర్లకు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, వేగాన్ని నియంత్రించడం, మలుపుల వద్ద జాగ్రత్తగా వాహనం నడపడం వంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.