PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 9:33 pm Posted By : Sathish Bede

ప్రైవేట్ బస్సులపై ముమ్మర తనిఖీలు

చింతూరు, పన్ పవర్ ఏప్రిల్ 1:

రాష్ట్రంలో ఇటీవల బస్సుల్లో అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖల సంయుక్త బృందాలు బుధవారం తెల్లవారుజామున చింతూరులో బస్సులను విస్తృతంగా తనిఖీ చేశాయి. మూడు శాఖల సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బండారు చల్లారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి బస్సులో ఎమర్జెన్సీ డోర్, ఎమర్జెన్సీ విండోలు, ఫైర్ ఎగ్జిష్టింగ్విషర్ వంటి భద్రతా సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. తనిఖీల్లో ఈ సౌకర్యాలు లేని బస్సులపై చలానాలు విధించినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని, డ్రైవర్లు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.