PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 10:34 pm Posted By : M CHANTI BABU

భారీ వర్షాలకు ఇల్లు కోల్పోయిన బాధితుడికి సహాయం చేయాలి

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 23:సంకాడ గ్రామపంచాయతీ పరిధిలోని నిమ్మలపాలెం గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా మొండి రామకృష్ణ ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం నిలువనీడ కోల్పోయి, నివాసానికి వీలులేని దయనీయ స్థితిలో పడింది.ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఘటన స్థలాన్ని పరిశీలించాలని పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఊలం ఈశ్వర్ కోరారు. బాధిత కుటుంబానికి తాత్కాలిక నివాస సౌకర్యం కల్పించి, తార్పాలిన్లు, అవసరమైన సామగ్రి మరియు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నామని ఆయన తెలిపారు.