మంచినీటి సౌకర్యం కల్పించాలన్న టిడిపి నేత చెండా బాబుజి.
ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.మండలంలో గల మాకవరం పంచాయతీ కేంద్రంలో తీవ్రమైన నీటి ఎద్దడితో గ్రామం తలడిల్లుతుంది. 80 కుటుంబాలుగా ఉన్న గ్రామంలో ఒకే ఒక్క బోరు, ఓ ఊటగెడ్డ నీళ్లు మాత్రమే గ్రామస్తులకు దిక్కుగా మారింది. వేసవి దృష్ట్యా గ్రామస్తులు నీటి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సోమవారం పర్యటించిన టిడిపి నేత బాబుజి దృష్టికి గ్రామస్తులు సమస్యలు తీసుకురాగా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బాబుజి తెలిపారు. గ్రామంలో తక్షణమే మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బిసాయి సీతారం, ఇది మెంటల్ పీసా కమిటీ ఉపాధ్యక్షులు డి పులందర్, బజ్జంగి భాస్కరరావు, గాసన్నా, స్వామి, చిన్ను, భీమన్న, సురేంద్ర, కామేష్, జగత్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.