శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న డాక్టర్ వంపూరు గంగులయ్య
చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 17: మన్యంలో నిర్వహించే గ్రామదేవతల జాతర్లు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఏపీ జానపద కళలు, సంస్కృతి సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య పేర్కొన్నారు.శుక్రవారం చింతపల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గంగులయ్యను ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుతూ, గిరిజన సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొర్లె వీర వెంకట్, సుర్ల వీరేంద్ర, వంతల సుబ్బారావు, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.