PEN POWER
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 9:26 am Posted By : starsrinu1899@gmail.com

మన రాజధాని మన అమరావతి సంబరాలు నిర్వహించండి. ప్రభుత్వ ఆదేశాలు….

అడ్డతీగల ,పెన్ పవర్, ఏప్రియల్ 02: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత గుర్తింపు లభించిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయని అడ్డతీగల ఎంపీడీవో కుమార్ తెలిపారు. ఆదేశానుసారం అడ్డతీగల ఎంపీడీవో కార్యాలయం ఎదుట దీపాలంకరణతో సంబరాలు నిర్వహించామని ఎంపీడీవో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హృదయ ధ్వని అమరావతి అనే భావంతో స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం తరహాలో అన్ని ప్రభుత్వ భవనాలకు దీపాలతో అలంకరించాలని, ప్రతి ఇంటి ముందు దీపాలంకరణ చేయాలని అలాగే సోషల్ మీడియా మరియు స్థానిక పత్రికల ద్వారా మన రాజధాని అమరావతి అని విస్తృత ప్రచారం చేయాలని ,అన్ని ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేయాలని సమన్వయంతో ఏకరీతిగా ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు అందినట్లు ఎంపీడీవో కుమార్ తెలిపారు.