PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 10:02 am Posted By : M CHANTI BABU

మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులను నియంత్రించాలి 

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 7: జీకేవీధిలో బాలికలు, మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులను నిర్భయంగా ఎదుర్కోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ సూచించారు. మంగళవారం స్థానిక ఎస్సై సురేష్‌తో కలిసి జీకేవీధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ సుధాకర్ మాట్లాడుతూ బాలికలు, మహిళలను రక్షించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ వంటి ఘటనలను అరికట్టడంతో పాటు, సమాజంలో జరుగుతున్న భౌతిక దాడుల నుంచి వారిని కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.దాడుల పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఎదుర్కొని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ ర్యాలీలో పోలీసులు, స్థానికులు పాల్గొని మహిళల భద్రతపై అవగాహన పెంపొందించారు.