ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర.
అంబేద్కర్ ఆశయ సాధన సమితి.
ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. అంబేద్కర్ అనేక సంఘ సంస్కరణలు తీసుకోవచ్చి, బడుగు బలహీన వర్గాల వారికి సముచిత స్థానం కల్పించి భారత రాజ్యాంగ నిర్మించరన్నారు. భగవద్గీత, కురాన్, బైబిల్ చదవకపోయినా బ్రతకవచ్చు గాని భారత రాజ్యాంగం చదవకపోతే సమాజంలో మనిషి అనే వాడు బ్రతకటం చాలా కష్టంగా ఉందన్నారు. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ల అవుతున్న దేశం వెనకబాటుకి గురికావడానికి కారణం మూడనమ్మకాలు మాత్రమేనన్నారు. రాజ్యాంగాన్ని అమలుకు అందరూ కృషి చేయాలని, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ మండలంలో అంబేద్కర్ ఆశయ సాధనకు ఎంతో కృషి చేస్తున్నాయని ఆమె కొనియాడారు. ప్రతి ఏటా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకొనుటకు ప్రతి ఇంటింటికి వెళ్లి ఉద్యోగ సంఘ నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు కృషి చేస్తున్నారన్నారు. తదనంతరం అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం నేటి వరకు దేశంలో అనేకమందికి తెలియకుండా ఉన్నాయని, ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో అంబేద్కర్ ఆశయ సాధన సమితి ముందుకు వెళుతుందన్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు మార్చే ప్రయత్నం జరుగుతుందని, వాటిని పరిరక్షించుటకు రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామని అనిల్ కుమార్ తెలిపారు. గిరిజన ప్రాంతంలో మనకున్నటువంటి హక్కులు చట్టాలు తొలగిపోనున్న పరిస్థితుల్లో వాటి పరిరక్షణకు ప్రతిష్టమైన ప్రణాళికతో అంబేద్కర్ ఆశయ సాధన సమితి ముందుకు వెళుతుందన్నారు. మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. టిడిపి మండల అధ్యక్షురాలు సన్యాసమ్మ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు ఉన్నత స్థానాన్ని కల్పించారని, అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని ఆమె అన్నారు. ఎంపీడీవో ధర్మారావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగము అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించిందని, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి అన్నారు. జయంతి వేడుకలకు ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అల్లరించాయి. అదేవిధంగా మండలంలో గల కించాయిపుట్టు పంచాయతీ కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.