PEN POWER
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 7:40 pm Posted By : SRIKANTH NARASIMHALA

విఆర్వో సహా నలుగురు సిబ్బంది సస్పెన్షన్

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 02:

నాదెండ్ల : విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఆరోపణల నేపథ్యంలో నలుగురు ప్రభుత్వ సిబ్బందిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

సంకురాత్రిపాడు గ్రామ రెవెన్యూ అధికారి ఇట్టెల నాగ జ్యోతి, అదే గ్రామానికి చెందిన డిజిటల్ సహాయకుడు సయ్యద్ అహదుల్లా, నాదెండ్ల-1 పరిధిలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు తాడిబోయిన ఈశ్వర్ యాదవ్, గ్రామ సర్వేయర్ వాసిమళ్ళ సుందర్ పాల్‌లపై ఈ చర్యలు తీసుకున్నారు.

గ్రామ సచివాలయాల్లో పౌర సేవల కోసం వచ్చే ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురిచేసినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

ఈ సస్పెన్షన్ చర్యలను సంబంధిత అధికారులు ధృవీకరించగా, పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.