PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 8:34 pm Posted By : K U FIROSE

విశాఖ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు

-గూగుల్ శంకుస్థాపనతో గ్లోబల్ ఏఐ డేటా హబ్‌గా విశాఖ
-సీఎం చంద్రబాబు విజన్, బ్రాండ్‌ – మంత్రి నారా లోకేష్ పట్టుదలతో విశాఖ వైపు ప్రపంచ దృష్టి
-ఏపి టిడిపి అధ్యక్షుడు , ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం :పెన్ పవర్ , ఏప్రిల్ 28 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు . గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనతో విశాఖపట్నం పేరు ప్రపంచ పటంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిందన్నారు.
ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూసేలా చేసిన నాయకత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే అన్నారు. చంద్రబాబు విజన్‌కు లోకేష్ కార్యాచరణ తోడైతే ఏమి సాధ్యమో నిరూపితమైందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుసంధానంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబద్ధత, మంత్రి నారా లోకేష్ ఆధునిక వ్యూహాలతో కలిసి రాష్ట్రాన్ని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ సమిష్టి దృష్టి ఫలితంగానే ఈ స్థాయి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. ప్రతి తెలుగు వాడు గుర్తుంచుకోవాలని, ఇది కేవలం శంకుస్థాపన మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న చారిత్రాత్మక రోజు అని , 1997లో హైటెక్ సిటీతో ప్రారంభమైన ఐటీ విప్లవం, నేడు గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో కొత్త దశలోకి ప్రవేశించిందన్నారు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ సిటీగా ఉన్నా, ఇకపై విశాఖ గ్లోబల్ ఎఐ డేటా హబ్‌గా మారిందని . ఇప్పటి వరకు గూగుల్‌లో విశాఖపట్నం గురించి వెతికేవారని, ఇకపై గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో విశాఖపట్నం నిలుస్తుందన్నారు . వైజాగ్‌లో జి అంటే గూగుల్ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి నగరం ఎదిగిందని, ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రయత్నించిన వారికి ఇదే సమాధానమని వ్యాఖ్యానించారు. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని, ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ డేటా గేట్‌వేగా నిలుస్తుందని పేర్కొన్నారు. తుర్లవాడ ప్రాంతం భవిష్యత్తులో టెక్నాలజీ హబ్‌గా మారి ప్రపంచ స్థాయిలో పేరు పొందుతుందని .విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి దూరదృష్టికి ప్రపంచ స్థాయి కితాబు అన్నారు పేర్కొన్నారు. గూగుల్ రాకతో విశాఖపట్నం రాబోయే రోజుల్లో గ్లోబల్ డెస్టినేషన్‌గా అవతరించబోతోందని తెలిపారు. సీబీఎన్ బ్రాండ్‌నే పెట్టుబడుల బలమైన పునాది అని, ప్రపంచంలో ఎక్కడైనా చంద్రబాబు పేరు చెప్పగానే పెట్టుబడిదారుల ముందు తలుపులు తెరుచుకుంటాయని అన్నారు. సైబరాబాద్ నిర్మాణం ఆయన దూరదృష్టికి నిదర్శనమని, అదే నమ్మకంతోనే గూగుల్ వంటి దిగ్గజాలు రాష్ట్రానికి వచ్చాయని పల్లా స్పష్టం చేశారు. గూగుల్ క్యాంపస్‌కు వెళ్లి సంస్థ ప్రతినిధులతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంలో లోకేష్ చూపిన కృషి అసాధారణమని, ఆయన నాయకత్వంలో లక్ష్యాలు కార్యరూపం దాలుస్తున్నాయని కొనియాడారు. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా మారిందని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి మరింత వేగం పుంజుకుందని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై వైఎస్సార్సీపీ నేతలు, జగన్ రెడ్డి అవాస్తవ ప్రచారాలకు దిగుతూ క్రెడిట్ చోరీ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పల్లా తీవ్రంగా విమర్శించారు. తమ పాలనలో పెట్టుబడులు పారిపోయున దశను మర్చిపోయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ఓర్వలేక విమర్శలు చేయడం వారి రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి అభివృద్ధి పథాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు.భోగాపురం విమానాశ్రయం, దక్షిణ కోస్తా రైల్వే జోన్, బుల్లెట్ ట్రైన్ప్          ప్రణాళికలు, అనకాపల్లి జిల్లా అభివృద్ధి అన్నీ కలిసి ఉత్తరాంధ్రను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతంగా మార్చబోతున్నాయని తెలిపారు. గూగుల్, అదానీ, ఎయిర్టెల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని, ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతాయని అన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదని ఇది ఒక మార్పు, ఒక దిశ, ఒక చరిత్ర అని , ఈ రోజు నుంచి విశాఖపట్నం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.