PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 9:37 pm Posted By : M CHANTI BABU

శుక్రవారం ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోనున్న డాక్టర్ వంపూరు గంగులయ్య 

చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 16:చింతపల్లిలోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ మరియు పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య శుక్రవారం ఉదయం 10 గంటలకు అమ్మవారి పవిత్ర దర్శనార్థం విచ్చేయనున్నారు.ఈ సందర్భంగా కొయ్యూరు, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది. నాయకుడికి ఘన స్వాగతం పలికి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ కోరారు. అమ్మవారి ఆశీస్సులతో జాతర కార్యక్రమం విజయవంతం కావాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.