PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 6:29 pm Posted By : D Ratnam

స్వర్ణ మొల్లేరు–జడేరు గ్రామాల్లో పర్యటించిన డిప్యూటీ ఎంపీడీవో గోపన్నదొర

 

గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 4 :
స్వర్ణ మొల్లేరు మరియు స్వర్ణ జడేరు గ్రామాల స్పెషల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఎంపీడీవో కె. గోపన్నదొర శనివారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మంచినీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నదా అనే విషయాన్ని పరిశీలించి, ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు తాగునీరు అందించాలని సిబ్బందికి సూచించారు.మొల్లేరు గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఆయన, ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌కు ఆదేశించారు. అలాగే జడేరు గ్రామంలో మంచినీటి ట్యాంకును పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు సరఫరా చేయాలని తెలిపారు.

గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన గోపన్నదొర, స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేపట్టి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని ఎస్ డబ్ల్యు పి సి సిబ్బంది, క్లాప్ మిత్రలకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు మరియు స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.