PEN POWER
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 8:49 pm Posted By : Sathish Bede

100శాతం ఉత్తీర్ణత శ్రీ భాస్కర విద్యానికేతన్‌

అద్భుత ఫలితాలతో మెరిసిన శ్రీ భాస్కర విద్యానికేతన్ విద్యార్థులు

 

శ్రీ భాస్కర విద్యానికేతన్‌లో మెరుగైన బోధనకు ఫలితం 100శాతం ఉత్తీర్ణత

 

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30:

 

శ్రీభాస్కర విద్యానికేతన్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ఫలితాలతో పాఠశాల పేరు మరింతగా వెలుగులోకి రావడంతో పాటు విద్యార్థుల కృషి అందరి ప్రశంసలు అందుకుంది. విద్యార్థుల ప్రతిభ ఈ విధంగ కొట్ల వర్షిత పద్మశ్రీ 600కు 567 మార్కులు సాధించి చింతూరు డివిజన్ లో రెండో స్థానం, పాఠశాలలో టాప్ స్థానంలో నిలిచింది. బత్తుల జోష్నా శ్రీ 551 మార్కులు సాధించి రెండో స్థానంలో, బత్తుల నవదీప్ 511 మార్కులు సాధించి మూడవ స్థానం లో నిలిచి ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ఈ ఫలితాలు పాఠశాలలో ఉన్న నాణ్యమైన బోధనకు నిదర్శనంగా నిలిచాయి. విద్యార్థుల విజయంపై పాఠశాల చైర్మన్ వి. రంగయ్య, డైరెక్టర్ సి.హెచ్. వేణు గోపాల్ రావు, ప్రిన్సిపాల్ వి. రాంబాబు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కృషిని మెచ్చుకున్నారు. విద్యార్థుల విజయం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ పాఠశాల నిర్వహణకు కృతజ్ఞతలు తెలిపారు. చింతూరు ప్రాంత ప్రజలు కూడా ఈ విజయాన్ని అభినందిస్తూ పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. చింతూరు మండలంలోని శ్రీ భాస్కర విద్యానికేతన్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.