PEN POWER
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 6:17 pm Posted By : M CHANTI BABU

16న జీకేవిధి లో గ్రామసభ నిర్వహణ 

గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15:ఈనెల 16న జీకే వీధి పంచాయతీ కేంద్రంలో గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి పండ్ర పాల్ తెలిపారు. మంగళవారం ఆయన అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే పంచాయతీ ప్రజల నిర్ణయం మేరకు ఈనెల 16న గురువారం ఈ గ్రామసభను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గిరిజనులు సమస్యలను గ్రామసభలో తెలియజేయాలన్నారు. ఆ సమస్యలను తీర్మానం చేసి వీలైనంత త్వరగా పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ గ్రామ సభను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.