PEN POWER
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 5:24 pm Posted By : PEN POWER MEDIA

ఘనంగా బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలు

సీతమ్మపేట హరిజనవీధిలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. 

 

 

  • హరిజనవీధిలో జయంతి వేడుకల నిర్వహణ
  • జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలతో నివాళి
  • సామాజిక న్యాయం కోసం చేసిన సేవల స్మరణ
  • పిల్లలకు మిఠాయిల పంపిణీతో సందడి
  • పెద్ద సంఖ్యలో నాయకులు, మహిళలు,

 

సీతమ్మపేట, పెన్ పవర్ ఎప్రిల్ 05:

  విశాఖ ఉత్తరం 25వ వార్డు హరిజనవీధిలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు గాంధీ హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మువ్వల పొలారావు, ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మువ్వల సంతోష్ కుమార్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా వారు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తు చేసుకున్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. వేడుకలో 25వ వార్డు ఎస్సీ సెల్ అధ్యక్షులు జోరిగల గణేష్, వార్డు కార్యదర్శులు పిల్లి పవన్, జామి రాజు, జిల్లా ఎస్సీ సెల్ సభ్యులు, పబ్లిసిటీ వింగ్ నాయకులు, మహిళలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.