PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 9:26 am Posted By : A YESOBU

పోషకాహారంతోనే చిన్నారులకు భవిష్యత్తు…

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 16

గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పౌష్టికాహారం.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, పోషకాహారంతోనే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ దేవీ బాయ్ అన్నారు.ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని గురువారం పుల్లల చెరువు మండలం మానేపల్లి గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ దేవి బాయ్ ప్రారంభించారు. అనంతరం పోషణ పక్వాడ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ దేవీ బాయ్ మాట్లాడుతూ గర్భిణుల నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, విద్యా విషయాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి గర్భిణి, బాలింత, చిన్నారికి సరైన పోషకాహారం అందేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు పోషకాహారం పై చైతన్యం కల్పించేందుకు అంగన్వాడి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు చైతన్య,సుబ్బరతం,కమలమ్మ,శేషుకుమారీ,జి సుజాత,అంగన్వాడి ఆయాలు, తల్లులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.