PEN POWER
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 8:03 am Posted By : PEN POWER MEDIA

కడలూరులో విజయ్ ప్రచారం మళ్లీ రద్దు…

  • తమిళనాడులో పీక్స్‌కు ఎన్నికల వేడి 
  • కడలూరు టూర్‌కు విజయ్‌కు మళ్లీ అనుమతి
  • చివరి నిమిషంలో రద్దైన ప్రచారం
  • 21 షరతులతో పోలీసుల గ్రీన్ సిగ్నల్
  • నాలుగు ప్రాంతాల్లో రాత్రి 9 వరకు ప్రచారం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, 21వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి.

న్యూస్ డెస్క్ పెన్ పవర్| ఏప్రిల్ 11:

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎమ్. కే స్టాలిన్ ఉదయం, సాయంత్రం పలు నగరాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా వరుస నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే సీమాన్ తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో తమిళనాడు వెట్రి కజగం నాయకుడు విజయ్ కడలూరు జిల్లాలో సుడిగాలి ప్రచారానికి సిద్ధమయ్యారు. కడలూరు, వడలూరు, సేతియతోప్పు, తిట్టకుడి ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించేందుకు ముందుగా అనుమతి కోరగా, పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.అయితే అనూహ్యంగా ఆ ప్రచార కార్యక్రమం చివరి నిమిషంలో రద్దు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అనంతరం అదే ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) మళ్లీ ప్రచారం నిర్వహించేందుకు పోలీసులను మరోసారి అనుమతి కోరారు.దీనిపై విచారణ జరిపిన పోలీసులు మొత్తం 21 షరతులతో ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు కడలూరులో ప్రారంభమయ్యే విజయ్ ప్రచారం, వడలూరు, సేతియతోప్పు మీదుగా తిట్టకుడిలో రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఈ ప్రచారం విజయ్ పార్టీకి కడలూరు జిల్లాలో ఎంత మేరకు రాజకీయ ఊపునిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.