- వ్యక్తి అరెస్ట్, 50 విస్కీ బాటిల్స్ స్వాధీనం
ములగాడ, పెన్ పవర్, మే 10 :
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీహరిపు రంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ టనపై మల్కాపురం పోలీసులు క్రైం నెం.74/ 2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మ ల్కాపురం పి.ఎస్. ఎస్ హెచ్ ఓ ఆదేశాల మేర కు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్‌ఐ శ్రీను తన సిబ్బందితో కలిసి శ్రీహరిపురంలోని హాట్ చిప్స్ దుకాణం ఎదురుగా ఆకస్మిక దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లాలపా లెంకు చెందిన నిందితుడు అక్రమంగా మద్యం బాటిల్స్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిందితు డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సిల్వర్ స్ట్రైప్స్ విస్కీకి చెందిన 50 బాటిల్స్ ప్రతి ఒక్కటి 180 ఎం.ఎల్.ను స్వాధీనం చేసుకు న్నారు. పంచనామా నిర్వహించిన అనంతరం ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34(ఎ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.