PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 10:07 am Posted By : M CHANTI BABU

అల్లూరి జిల్లా పదో తరగతి టాపర్ గా దేవి 

పదవ తరగతిలో 593/600 మార్కులు.

జోలపుట్టు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని.

ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా టాపర్ గా పరంబుడి దేవి నిలిచారు. ముంచంగిపుట్టు మండలం, జోలపుట్టు జెడ్పి ఉన్నత పాఠశాలలో చదివిన దేవి 593/600 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచింది. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీకి చెందిన దేవి, తల్లి ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ గా, తండ్రి మచ్కండ్ ప్రాజెక్టులో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నారు. జిల్లా టాపర్ గా నిలిచిన దేవి వాల్ పోస్టర్ ను అల్లూరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం గమనార్హం. అల్లూరి జిల్లా టాపర్ గా నిలిచిన దేవి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. విద్యాశాఖ అధికారులు కోడా కృష్ణమూర్తి, త్రినధరావు, పాఠశాల సిబ్బంది దేవిను అభినందించారు.